దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు

deevuddu manaku ellappuddu - toodduga nunnaaddu

🎵 TG-1079💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

ఏదెనులో ఆదాముతోనుండెన్‌ -హానోకుతోడ నేగేను ధీర్గదర్శకులతో నుండెను - ధన్యులు దేవుని గలవారు "తోడుగ"

2వ చరణం

దైవాజ్ఞను శిరసావాహించి - దివ్యముగ నబ్రాహము కన్న కుమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన యపుడు "తోడుగ"

3వ చరణం

యేసేపు ద్వేషించబడి నపుడు - గోతిలో త్రోయ బడినపుడు శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కిన యపుడు "తోడుగ"

4వ చరణం

ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినా యపుడు "తోడుగ"

5వ చరణం

దావీదు సింహము నెదిరించినపుడు - దైర్యముగ, చీల్చీనపుడు గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరమ బడినపుడు "తోడుగ"

6వ చరణం

సింహపు బోనులో దానియేలు - షడ్రకు,మేషకు, అబెద్నెగో అగ్ని గుండములో వేయబడెన్‌ - నల్గురుగా కనబడినపుడు "తోడుగ'

7వ చరణం

పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు అపొస్తులులు విశ్వాసులు - హింసించాబడిన యపుడు "తోడుగ"

Report Error