దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు
deevudu maapakssamuna undagaa maaku viroodi evadu
🎵 TG-1080🌐 Telugu
పల్లవి
దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము (2) యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే || దేవుడు ||
1వ చరణం
మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును (2) తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృపచూపించి తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనబరుచును || యుద్ధం||
2వ చరణం
మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం భలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము (2) దేవుని చేసుర క్రియలు చేసి - భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి - ప్రభు ద్వజము స్తాపింతుము ||యుద్ధం ||