దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు
deevudu manaku ellappudu - thooduga nunnaadu
దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు (2)
ఏదెనులో ఆదాముతోనుండెన్ -హానోకుతోడ నేగేను ధీర్గదర్శకులతో నుండెను - ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
దైవాజ్ఞను శిరసావాహించి - దివ్యముగ నబ్రాహము కన్న కుమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన యపుడు ||తోడుగ||
యేసేపు ద్వేషించబడి నపుడు - గోతిలో త్రోయ బడినపుడు శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కిన యపుడు ||తోడుగ||
ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినా యపుడు ||తోడుగ||
దావీదు సింహము నెదిరించినపుడు - దైర్యముగ, చీల్చీనపుడు గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరమ బడినపుడు ||తోడుగ||
సింహపు బోనులో దానియేలు - షడ్రకు,మేషకు, అబెద్నెగో అగ్ని గుండములో వేయబడెన్ - నల్గురుగా కనబడినపుడు ||తోడుగ' ||దేవుడు మనకు||
పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు అపొస్తులులు విశ్వాసులు - హింసించాబడిన యపుడు ||తోడుగ||