దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి

deevum dichchina divyavaakya mi

🎵 TG-252💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవుఁ డిచ్చిన||

1వ చరణం

భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవుఁ డిచ్చిన||

2వ చరణం

సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవుఁ డిచ్చిన||

3వ చరణం

ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు ||దేవుఁ డిచ్చిన||

4వ చరణం

పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను ||దేవుఁ డిచ్చిన||

5వ చరణం

దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుఁ డిచ్చిన||

6వ చరణం

మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

7వ చరణం

నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవుఁ డిచ్చిన||

8వ చరణం

మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవుఁ డిచ్చిన||

Report Error