దేవుండవైన యాత్మ! రా నీ

deevundavaina yaathma! raa nee

🎵 TG-624💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవుండవైన యాత్మ! రా నీ వారి నీవు ప్రీతిగా నీ సత్కృపావరంబు నీ నీ ప్రేమ గుమ్మరింపుమీ.

1వ చరణం

సమస్త భూ జనంబులు సద్దేవు విశ్వసింపను నీ దివ్య వాక్య కాంతితో నిత్యంబు వారి బిల్తువు. ||దేవుండవైన యాత్మ!||

2వ చరణం

దేవా! విశుద్ధ తేజమా! జీవంపు వాక్య మిమ్మయా మా తండ్రియంచు బిల్వను మా దేవుదెల్పి నేర్పుము. ||దేవుండవైన యాత్మ!||

3వ చరణం

దుర్భోధ చేయువారిని దూరంబునందు నుంచుమీ మా యేసు క్రీస్తు డొక్కడే ఓదార్చు బోధ కుండిలన్. ||దేవుండవైన యాత్మ!||

4వ చరణం

ఓ దివ్య ప్రేమ! యూరటా మోదంబుతోడ మమ్ముల నీదైవ సేవ చేయనీ నాధుండ!! హింస లోర్వనీ ||దేవుండవైన యాత్మ!||

5వ చరణం

జీవించి యున్న జచ్చినన్ జీవాత్మముక్తి పొందగన్ మా కిమ్ము నీ బలంబును నమ్మిక గట్టి బర్చుము, ఆమేన్ ||దేవుండవైన యాత్మ!||

Report Error