దేవుని సముఖ జీవ కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా

deevuni samukha jiiva kavileloo - nii peerunnadaa...aa..aa niipeerunnadaa

🎵 TG-1076💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

జీవవాక్యము నిలలో చాటుచు - జీవితము లర్పించిరే హత సాక్షుల కవిలెలోన - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"

2వ చరణం

ఆకాశమండలములలో తిరిగెడు - అందకార శక్తులను గెలిచిన విజయవీరుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"

3వ చరణం

పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంధము సూచించు సర్వోన్నతుని పురములలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని" దేవుని సముఖ జీవ కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా

4వ చరణం

దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన ప్రార్ధన వీరుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"

5వ చరణం

పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా పరిశుద్ధుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"

Report Error