దేవుని స్తుతించ రండి గత

deevuni sthuthincha randi gatha

🎵 TG-1420🌐 Telugu
పల్లవి

దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను – కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని||

1వ చరణం

కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టముల బాపి మనల నింక జగమున జీవితులుగా నుంచినట్టి – మహా ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మెల్లను చేసెనుగా నిరతము కాచి చక్కగాను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగా నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి వత్సారంభముననిను మే మొక్కటిగా నారాధింప దైవ కుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి – మహా భూమి యందలి మాయల నుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిను సేవింప నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి | ప్రతి సంవత్సరమును మము జూడుము దుర్గములో మము చేర్చుమయ్యా దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వాదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నుండ నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు

Report Error