దేవుని వారసులం ప్రేమ నివాసులము
deevuni vaarasulam preema nivaasulamu
దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోకపౌరులము హల్లెలూయ నవయుగ
దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతము ||దేవుని వారసులం||
పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగహోమము జేయుదము ||దేవుని వారసులం||
అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయో వీనులవిందగు పాటలతో ధ్యానము చేయుచు మరియుదుము ||దేవుని వారసులం||
సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము ||దేవుని వారసులం||
గోధుమ గింజవలె క్రీస్తుడు చావగను నాధుని మరణములో శాశ్వత జీవమును నిధులుగ పండించి లేవగను మాధుర్య రక్షణ లభియించెను ||దేవుని వారసులం||
హతసాక్షుల కాలం అవనిలో చెలరేగ గతకాలపు సేవ గొల్గొత గిరి భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము ||దేవుని వారసులం||
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ విభు మహిమను గాంచ విశ్వమే మముగోర శుభములు గూర్చుచు మాలోన శోభిల్లుయేసును జూపుదము ||దేవుని వారసులం||