దేవుని వారసులం - ప్రేమ నివాసులము
deevuni vaarasulan - preema nivaasulamu
పల్లవి
జీవన యాత్రికులం - యేసుని దాసులము నవ యుగ సైనికులం - పరలోక పౌరులము హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
1వ చరణం
దారుణ హింస లలో - దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో - ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
2వ చరణం
పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక - బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదము
3వ చరణం
అనుదిన కూటములు - అందరి గృహములలో ఆనందముతోను - ఆరాధనలాయే వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము