దేవుని యందు - నిరీక్షణ నుంచి
deevuni yandu - niriikssanna nunchi
పల్లవి
ఆయనను స్తుతించు - నా ప్రాణమా
1వ చరణం
ఏ పాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడు వాడు ప్రతిక్షణం - నీపక్షముండు రక్షకుడు "దేవుని"
2వ చరణం
చీకటిని వెలుగుగ చేసి - ఆయన నీ ముందు పోవువాడు సత్యమగు జీవమగు - మార్గము యేసే "దేవుని"
3వ చరణం
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే ఆధారము - ఆధరణ ఆయనలో "దేవుని"
4వ చరణం
తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు "దేవుని"
5వ చరణం
నీకు విరోధముగా నిరూపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగా మారుదురు "దేవుని"
6వ చరణం
పర్వతములు తొలగి పోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు కనికర సంపన్నుడు - నీ దేవుడు "దేవుని"
7వ చరణం
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ "దేవుని"