దేవునికి స్తోత్రము గానము చేయుటయే

deevuniki sthoothramu gaanamu cheeyutayee

🎵 TG-658💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

1వ చరణం

యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని(2) ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి స్తోత్రము||

2వ చరణం

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి స్తోత్రము||

3వ చరణం

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటి కన్నియు పేరులు పెట్టిచున్నవాడని ||దేవునికి స్తోత్రము||

4వ చరణం

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి స్తోత్రము||

5వ చరణం

దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి స్తోత్రము||

6వ చరణం

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము సిద్ధపర్చువాడని ||దేవునికి స్తోత్రము||

7వ చరణం

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి స్తోత్రము||

8వ చరణం

గుర్రముల నరులదలి బలము నానందించుడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి స్తోత్రము||

9వ చరణం

యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి స్తోత్రము||

10వ చరణం

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీగుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి స్తోత్రము||

11వ చరణం

భూమికి తన యాజ్ఞన ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి స్తోత్రము||

12వ చరణం

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనయు కీలాగున చేసి యుండ లేదని ||దేవునికి స్తోత్రము||

Report Error