దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
deevuniki sthoothramu gaanamu - cheeyutayee manchidi
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము - చేయుటయే మంచిది
యెరుషలేము యెహోవాయే - కట్టుచున్న వాడనీ ఇశ్రాయేలీయులను - పోగు చేయు వాడని ||దేవునికి స్తోత్రము||
గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడనీ వారి గాయము లన్నియు - కట్టుచున్న వాడని ||దేవునికి స్తోత్రము||
నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని ||దేవునికి స్తోత్రము||
ప్రభువు గొప్ప వాడును - అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని ||దేవునికి స్తోత్రము||
దీనులకు అండాయనే - భక్తి హీనుల కూల్చును సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి ||దేవునికి స్తోత్రము||
ఆయన ఆకాశము - మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము - సిద్ధ పరచు వాడని ||దేవునికి స్తోత్రము||
పర్వతములో గడ్డిని - పశువులకు మొలిపించును అరచు పిల్ల కాకులకును - ఆహారము తానీయును ||దేవునికి స్తోత్రము||
యెరుషలేము యెహోవను - సీయోనూ నీ దేవునీ కీర్తించుము కొని యాడుము - ఆనందించు వాడని ||దేవునికి స్తోత్రము||