దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
deevuniki stootramu gaanamu - cheeyuttayee manchidi
పల్లవి
మనమందరము స్తుతిగానము - చేయుటయే మంచిది
1వ చరణం
యెరుషలేము యెహోవాయే - కట్టుచున్న వాడనీ ఇశ్రాయేలీయులను - పోగు చేయు వాడని
2వ చరణం
గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడనీ వారి గాయము లన్నియు - కట్టుచున్న వాడని
3వ చరణం
నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని
4వ చరణం
ప్రభువు గొప్ప వాడును - అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని
5వ చరణం
దీనులకు అండాయనే - భక్తి హీనుల కూల్చును సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
6వ చరణం
ఆయన ఆకాశము - మేఘములతో కప్పును భూమి కొరకు వర్షము - సిద్ధ పరచు వాడని
7వ చరణం
పర్వతములో గడ్డిని - పశువులకు మొలిపించును అరచు పిల్ల కాకులకును - ఆహారము తానీయును
8వ చరణం
యెరుషలేము యెహోవను - సీయోనూ నీ దేవునీ కీర్తించుము కొని యాడుము - ఆనందించు వాడని