దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను

deevuniyandu nireekssanna nunchi aayananu

🎵 TG-2019🌐 Telugu
పల్లవి

దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)      ||దేవుని||

1వ చరణం

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు సత్యమగు – జీవమగు – మార్గమేసే నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే ఆధారము – ఆదరణ – ఆయనలో తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు – మిత్రులుగా – మారుదురు పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు కనికర – సంపన్నుడు – నా దేవుడు స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ

Report Error