ధన్యము ఎంతో ధన్యము

dhanyamu enthoo dhanyamu

🎵 TG-1524🌐 Telugu
పల్లవి

ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2) ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)          ||ధన్యము||

1వ చరణం

ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో ఎవరి పాపములు – మన్నించబడెనో (2)          ||వారె ధన్యులు||

2వ చరణం

క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును అపవాది తంత్రములు – గుర్తించు వారును శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును

Report Error