ధన్యము ఎంతో ధన్యము - యేసయ్యను కలిగిన జీవితము

dhanyamu entoo dhanyamu - yeesayyanu kaligina jiivitamu

🎵 TG-1068💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఇహమందున,పరమందున - నూరు రెట్లు ఫలముండును వారె ధన్యులు - వారెంతో ధన్యులు (2)

1వ చరణం

ఎవరి అతిక్రమములు - పరిహరింపబడెనో ఎవరి పాపములు - మన్నించబడెనో "వారెధన్యులు"

2వ చరణం

క్రీస్తు యేసుకు సమర్పించు - కరములే కరములు క్రీస్తుయేసు స్వరము విను - వీనులే వీనులు "వారెధన్యులు"

3వ చరణం

ప్రభు యేసుని సేవచేయు - పాదములే సుందరములు ప్రభుని గూర్చి పాటపాడు - పెదవులే పెదవులు "వారెధన్యులు"

4వ చరణం

ఆత్మలో నిత్యము - ఎదుగుచున్న వారును అపవాది తంత్రములు - గుర్తించు వారును "వారెధన్యులు"

5వ చరణం

శ్రమలయందు నిలచి - పాడుచున్న వారును శత్రు భాణములెల్ల - చెదరగొట్టు వారును "వారెధన్యులు"

Report Error