ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై

dharannilooni dhanamu lella dharannipaalai

🎵 TG-291💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను నిరత ముండెడి ధనమును ||ధరణిలోని ధనము||

1వ చరణం

యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని వేగము దివ్య వరముగ నమ్మికన్ ||ధరణిలోని ధనము||

2వ చరణం

విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న నీకుఁ గల్గు వేద నాధికంబుపో ||ధరణిలోని ధనము||

3వ చరణం

పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ మిచ్చిన పరమధాముని నమ్ముమీ ||ధరణిలోని ధనము||

4వ చరణం

తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు ||ధరణిలోని ధనము||

5వ చరణం

దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు మిత్ర నేట నెచట వెదకినన్ ||ధరణిలోని ధనము||

Report Error