దినదినంబు యేసుకు - దగ్గరగా చేరుతా

dinadinanbu yeesuku - daggaragaa cheerutaa

🎵 TG-1070💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

అనుక్షణంబు యేసుని - నామదిలో కోరుతా ఎల్లప్పుడు యేసువైపు - కనులెత్తి పాడుతా ప్రభుని మాట నాదు భాట - విభుని తోనే సాగుతా "దిన"

1వ చరణం

మారిపోయే లోకమందు - మనుష్యులెంతో మారినా మారునా ప్రభు యేసు ప్రేమ - ఆశతోడ చేరనా "దిన"

2వ చరణం

దైవ వాక్యం - జీవ వాక్యం దిన దినంబు చదువుతా ప్రభుని మాట నాదు భాట విభునితో మాట్లాడుతా "దిన"

3వ చరణం

ఎన్నడు ఎడబాయడు నను - విడువడు ఏ మాత్రము ప్రభువే నాదు అభయము - భయపడను నేనేమాత్రము "దిన"

4వ చరణం

పరిశుద్దముగా అనుకూలముగా - జీవయాగమై నిలిచెద సిలువ మోసి సేవ చేయ - యేసుతోనే కదులుతా "దిన"

Report Error