ఈ దినం క్రీస్తు జన్మ
ee dinam kreesthu janma
🎵 TG-2346🌐 Telugu
పల్లవి
ఈ దినం క్రీస్తు జన్మ దినం శుభకరం లోక కళ్యాణం పరమును విడచి ఇలకు చేరిన మహిమ అవతారం (2) ఆడుము పాడుము ప్రభుని నామము నూతన గీతముతో రక్షణ పొందుము ఈ సమయము నూతన హృదయముతో (2) ||ఈ దినం||
1వ చరణం
దేవ దూతలు పలికిన ప్రవచనం జ్ఞానులకొసగిన దివ్య మార్గం ధన్యత కలిగిన దావీదు పురము కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము||
2వ చరణం
పాప దుఃఖములన్నియు పారద్రోలును కృపయు క్షేమము కలుగజేయును రక్షణ నొసగెడి పరమ సుతునికి ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||