ఏ రీతి స్తుతియింతునో
ee reethi sthuthiyinthunoo
🎵 TG-1471🌐 Telugu
పల్లవి
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా – నాదు నజరేయుడా తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా ఏ రీతి స్తుతియింతునో… నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి||
1వ చరణం
మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ||
2వ చరణం
వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను