ఈ సాయంకాలమున యేసు ప్రభో
ee saayankaalamuna yeesu prabhoo
పల్లవి
ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||ఈ సాయంకాలమున||
1వ చరణం
చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున||
2వ చరణం
దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||ఈ సాయంకాలమున||
3వ చరణం
నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున||
4వ చరణం
జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||