ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్
eedeen vananbunandu aadi vivaahamun
పల్లవి
ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్ విధించినట్టి వాక్కు వర్థిల్లు నిప్పుడున్.
1వ చరణం
పవిత్ర కల్యాణంబున్ పదిలపర్చుచు దైవ త్రిత్వంబు నేఁడున్ దీవింప వత్తురు. ||ఏదేన్ వనంబునందు||
2వ చరణం
సంతాన వరమును సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు. ||ఏదేన్ వనంబునందు||
3వ చరణం
ఆదామునకుఁ దండ్రీ, హవ్వ నొ సంగితి వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము ||ఏదేన్ వనంబునందు||
4వ చరణం
నీ ఱెక్క క్రింద వీరిఁ బరిగ్రహించుచు వైరి తంత్రంబునుండి దూరంబుఁ జేయుము. ||ఏదేన్ వనంబునందు||
5వ చరణం
ఈ రీతిన్ బ్రత్కి యంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి బరంగఁ జేయుమి. ||ఏదేన్ వనంబునందు||