ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు
eemivvagalanayya naa yeesayyaa neevu
🎵 TG-1499🌐 Telugu
పల్లవి
ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకై (2) నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య||
1వ చరణం
గురి లేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు మతి లేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి||
2వ చరణం
ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు