ఎల్లవేళలందు – కష్టకాలమందు వల్లభుండా
ellaveellalandu – kasstakaalamandu vallabhundaa
🎵 TG-1358🌐 Telugu
పల్లవి
ఎల్లవేళలందు – కష్టకాలమందు వల్లభుండా యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నా కెల్లెడల వల్లపడదే వివరింపన్ (2) విమోచకుడా – విమోచన నీవే రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు||
1వ చరణం
సృష్టికర్తవు – సహాయము నీవే ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే జ్ఞానము నీవే – నా పానము నీవే దానము నీవే – నా గానము నీవే జ్యోతివి నీవే – నా నీతివి నీవే ఆదియు నీవే – నా అంతము నీవే నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే స్తోత్రము నీవే – నా నేత్రము నీవే జీవము నీవే – నా దేవుడవు నీవే పావన నీవే – నా కావలి నీవే కాంతియు నీవే – నా శాంతియు నీవే సంతస నీవే – నాకంతయు నీవే