ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో
endukoo nanninthagaa neevu preeminchithivoo
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||ఎందుకో నన్నింతగా||
నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ||ఎందుకో నన్నింతగా||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||ఎందుకో నన్నింతగా||
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీసంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే ||ఎందుకో నన్నింతగా||
నా మనువులు ముందే నీ మనస్సులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంధంబులో నుండె ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ ||ఎందుకో నన్నింతగా||