ఎందుకో నన్ను నీవు ప్రేమించావు
endukoo nannu neevu preeminchaavu
🎵 TG-2797🌐 Telugu
పల్లవి
ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదనో దేవా (2) హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో||
1వ చరణం
నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు పాతాళ వేదన శ్రమలనుండి నన్ను విడిపించావు (2) ||నీ కృపను||
2వ చరణం
నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు నా గాయములను బాగు చేయ నీవు శ్రమనొందావు నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు పరలోక పరిచర్య భాగస్వామిగా నన్ను స్వీకరించావు