ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో

endumbooyedavoo haa prabhuraaya endumbooyedavoo

🎵 TG-203💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎందుఁబోయెదవో హా ప్రభురాయ ఎందుఁబోయెదవో ఎందుఁ బోయెదవయ్య యీ దుర్మానవశ్రేణి బొందఁదగిన భరంబుఁ బూని రక్షక నీవు ||ఎందుఁబోయెదవో హా||

1వ చరణం

వడగాలిలోను నీ నెమ్మోము వాడికందఁగను నొడలఁ జెమటయు నీరు నొడిసివర దయై పార నడుగులు తడఁబడ నయ్యా యిప్పుడు నీవు ||ఎందుఁబోయెదవో హా||

2వ చరణం

మూఁపుపై సిలువ శత్రు స మూహముల్ నడువఁ కాపు ప్రచండమౌ కారెండ కాయఁగ నేపున నా పాప మీ పాటు పెట్టఁగ ||ఎందుఁబోయెదవో హా||

3వ చరణం

విరువు గట్టివియో జనుల రక్షించు బిరుదలయ్యవియో పరమ రక్షకుండా నా పాపబంధము లవియో పరిశోదించెడి వారి పట్టుకొమ్మలవియో ||ఎందుఁబోయెదవో హా||

4వ చరణం

ఆకాశమందు దూతలు కొల్వ నతితేజ మొందు ప్రాకటమైన నీ సదముల్ పగులురాల తాఁకునఁబగిలి ర క్త ధారలొల్కఁగను ||ఎందుఁబోయెదవో హా||

5వ చరణం

పరమందుఁగల్గు పరిమళముచేఁ బసమించి వెల్గు చిరమౌ దేహమునకు నా యెరుష లేమను నట్టి పురములోపలి మన్ను పూత మయ్యెనా ప్రభువా ||ఎందుఁబోయెదవో హా||

6వ చరణం

ఒక పాలివెతలా రవ్వంతైన సుకరమౌ స్థితులా యకటా చెదరి గుండె లదరి ఝుల్ ఝుల్మని యొకటిఁ బొందక తాప మొంది కుందునే కర్త ||ఎందుఁబోయెదవో హా||

Report Error