ఎన్నడు నెడఁబాయ నే కొల(ది

ennadu nedambaaya nee kola(di

🎵 TG-397💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎన్నడు నెడఁబాయ నే కొల(ది విడనాఁడ ననిన తండ్రి నిరత మన్ని బాధలయందు నన్ని దుఃఖములందు నన్ను ఁ బ్రోచు ||ఎన్నడు నెడఁబాయ||

1వ చరణం

పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు ||ఎన్నడు నెడఁబాయ||

2వ చరణం

ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధుఁ డాతఁ డెల్ల విశ్వాసుల నెల్ల వేళలఁ దలఁచి యేలుచుండు ||ఎన్నడు నెడఁబాయ||

3వ చరణం

తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాఁడు తప్పకుండ నాతఁ డెనలేని దయఁబూని వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు నెడఁబాయ||

Report Error