ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
ennoo ennoo meelulu cheesaavayyaa
🎵 TG-2219🌐 Telugu
పల్లవి
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2) హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||
1వ చరణం
బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||
2వ చరణం
శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా