ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా

entainaa nammadagina deevuddavayyaa

🎵 TG-1317💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా పక్షమున యుద్ధమాడు శూరుడవయ్యా తొట్రుపడే ప్రాయములో నేనుండగా నా కేడెము ఆధారము నా యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

1వ చరణం

ఎల్లప్పుడు ప్రభువు నిన్ను విడనాడడు యవ్వన కాలమున కాడిమోయు నరునికి కృపని బట్టి జాలి పడే నా దేవుడు నా ప్రార్ధనకు చెవియొగ్గే నీతిసూర్యుడు ||హల్లెలూయ||

2వ చరణం

క్షమనొందని దోషినని అనుకొనవద్దు నన్ను కాదనుకొని నిన్ను కూడా పిలచుచున్నాడు సిగ్గు వీడి బిడియపడక ప్రభుని వేడు ఆపదలో అండైన మహాదేవుడు ||హల్లెలూయ||

Report Error