ఎంత దూరమైనా అది ఎంత

entha duuramainaa adi entha

🎵 TG-2236🌐 Telugu
పల్లవి

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు (2)        ||ఎంత||

1వ చరణం

నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా (2)        ||యేసు||

2వ చరణం

తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా

Report Error