ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై
entha preeminchenoo deevumdu manapai
ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై నెంతదయఁజూపెనో వింతగల యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే ||ఎంత ప్రేమించెనో||
పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని జూడరే ||ఎంత ప్రేమించెనో||
పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి మింటిపై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ మంటి కేతెంచె మన వంటి దేహము దాల్చి ||ఎంత ప్రేమించెనో||
ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత ప్రేమించెనో||
మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి మరలి వచ్చి మన దైన్యదేహమును తనరూపమును మార్చి కొనిపోయి తన రాజ్యమును మనకీయును ||ఎంత ప్రేమించెనో||
గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు డెట్టివాఁడొ మనమునట్టి వారుగ ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క ||ఎంత ప్రేమించెనో||