ఎంతదూరము మోయించెదరు స్వామి కింత
enthaduuramu mooyinchedaru svaami kintha
పల్లవి
ఎంతదూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి నుంతైన దయలేక ||ఎంతదూరము మోయించెదరు||
1వ చరణం
ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంతదూరము మోయించెదరు||
2వ చరణం
సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంతదూరము మోయించెదరు||
3వ చరణం
కరములు జోడించి కడకు గేత్సెమనిలో పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||ఎంతదూరము మోయించెదరు||
4వ చరణం
పిరికి పిలాతుని బెదరించి యదలించి యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంతదూరము మోయించెదరు||
5వ చరణం
ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు ||ఎంతదూరము మోయించెదరు||
6వ చరణం
కలువరి గిరివరకు సిలువ మోయలేక అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి ||ఎంతదూరము మోయించెదరు||
7వ చరణం
యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు ||ఎంతదూరము మోయించెదరు||