ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార

evani athikramamulu manninpabadenoo paapaparihaara

🎵 TG-636💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు

1వ చరణం

యెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని అతిక్రమములు||

2వ చరణం

మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని అతిక్రమములు||

3వ చరణం

దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని అతిక్రమములు||

4వ చరణం

నేను నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని అతిక్రమములు||

5వ చరణం

నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని అతిక్రమములు||

6వ చరణం

కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని అతిక్రమములు||

7వ చరణం

విస్తార జలప్రవాహము పొర్లినను నిశ్చయముగ అవి వారి మీదికి రావు ||ఎవని అతిక్రమములు||

8వ చరణం

నాకు దాగుచోటు నీవే శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా ||ఎవని అతిక్రమములు||

9వ చరణం

విమోచన గానములతో నీవు నన్ను ఆదరించి నాకుపదేశము చేసెదవు ||ఎవని అతిక్రమములు||

Report Error