ఎవరి కోసమో ఈ ప్రాణ

evari koosamoo ee praanna

🎵 TG-1796🌐 Telugu
పల్లవి

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) నీ కోసమే నా కోసమే కలువరి పయనం – ఈ కలువరి పయనం (2)        ||ఎవరి||

1వ చరణం

ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా సోలి వాలి పోయావా…. ||ఎవరి||

2వ చరణం

జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకొన్నావా… పరమ తండ్రిని

Report Error