పల్లవి
నీకోసమే నాకోసమే కలువరి పయనం ఈ కలువరి పయనం ....."ఎవరికోసమో"
1వ చరణం
ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా - 2 మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా... - సోలి వాలి పోయావా....
2వ చరణం
జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాము జీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి *తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు * అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని