ఎవరో తెలుసా యేసయ్యా - చెబుతా నేడు వినవయ్యా

evaroo telusaa yeesayyaa - chebutaa needdu vinavayyaa

🎵 TG-1030💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి - రక్షణ పొందవయ్యా

1వ చరణం

దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు - నీనా పాప విమోచనకై "ఎవరో"

2వ చరణం

ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా రూపు రేఖలు కోల్పోయాడు - నీనా పాపవిమోచనకై "ఎవరో"

3వ చరణం

పాపుల రక్షకుడేసయ్యా - కార్చెను రక్తము పాపులకై తన ధరి చేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో "ఎవరో"

4వ చరణం

యేసే దేవుడు ఎరుగవయ్యా - రాజులరాజుగా వస్తాడయ్యా నమ్మినవారిని చేర్చును పరమున - నమ్మని వారికి నరకమేగా "ఎవరో"

5వ చరణం

యేసుని తరుపున ప్రతినిధినై - దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బతిమాలుచున్నాను - నేడే నమ్ముము ప్రభు యేసుని "ఎవరో"

Report Error