గాయంబుతో నిండారు ఓ శుద్ధ

gaayanbuthoo nindaaru oo shuddha

🎵 TG-210💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస్సా! హా! ముండ్ల కిరీటంబు భరించు శిరస్సా! నీకిప్పుడు డపకీర్తి హాస్యంబు గల్గెఁగా కర్తా! ఘనంబు కీర్తి ఎన్నడు గల్గుఁగా

1వ చరణం

లోకంబు భీతి నొందు ప్రకాశపూర్ణుడా! ఆ యూదులైన వారు నీ మొము మీఁదను! నాఁడుమ్మి వేసినారా? నీ ముఖకాంతికి సమాన కాంతి లేదు కురూపి వైతివా. ||గాయంబుతో నిండారు||

2వ చరణం

నీవోర్చినట్టి బాధ నా క్రూర పాపమే! నాకోస మింత బాధ వహించినావుగా! దైవోగ్ర బాధ కేను పాత్రుండ నైతిని దృష్టించి నన్నుఁ జూఁచి కటాక్ష ముంచుమీ. ||గాయంబుతో నిండారు||

3వ చరణం

నేఁ బాపి నైతి గాని నన్ నీవు చేర్చుము! నీ నిత్యయూటనుండి మేళ్లన్ని పారును! నీ నోరు మాధుర్యంపు సుబోధఁ జెప్పెను నీ పావనాత్మ మోక్ష సుఖంబు లిచ్చును. ||గాయంబుతో నిండారు||

4వ చరణం

నా కోస మింత బాధ వహించి నందుకు! యధార్థమైన స్తుతి నిత్యంబు నీదగున్ నీ నామమందు నేను విశ్వాస ముంతును నా యంత్యకాలమందు నా యొద్దనుండుము. ||గాయంబుతో నిండారు||

Report Error