గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ

gathakaalamulayandu ghanasahaayuda deevaa hithanireekssanna

🎵 TG-062💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె నిత్యఁడౌ ప్రభువా ||గతకాలములయందు ఘనసహాయుడ||

1వ చరణం

నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా నొప్పు ప్రభువా ఘన దేవా ||గతకాలములయందు ఘనసహాయుడ||

2వ చరణం

నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ||గతకాలములయందు ఘనసహాయుడ||

3వ చరణం

వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము సుమియవ్వి ||గతకాలములయందు ఘనసహాయుడ||

4వ చరణం

గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ మీవె నిత్యుడౌ ప్రభువా ||గతకాలములయందు ఘనసహాయుడ||

Report Error