గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

goppa deevudavani shakthi sanpannudani

🎵 TG-1540🌐 Telugu
పల్లవి

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా (2)          ||గొప్ప||

1వ చరణం

అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2) అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను (2)          ||హల్లెలూయా||

2వ చరణం

సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ (2)           ||హల్లెలూయా||

Report Error