పల్లవి
హా! యానంద సుదినము నా యేసున్ నమ్ము దినము ప్రయాస మెల్ల బోయిన దయా రక్షణ దినము. ||హా! యానంద||
1వ చరణం
ప్రభునితో నిరంతమౌ నిబంధనఁ జేసికొంటి నేఁబుట్టితి నింపొందఁగ విభుని పాదపద్మము. ||హా! యానంద||
2వ చరణం
నా యాత్మ, శాంత మొందుము నీ యేసె నీ యాధారము భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము. ||హా! యానంద||
3వ చరణం
నే నేసువాఁడ నేసుఁడు నిత్యంబు నా వాఁ డాయెను ఇదెంత గొప్ప భాగ్యము నేనేసు యొక్క మిత్రుఁడన్ ||హా! యానంద||
4వ చరణం
నేఁ జేసెడి యొప్పందము ఎల్లడ నెఱవేర్తును నేఁ జచ్చు వేళయందును నీ దయ మెచ్చి పాడుదు. ||హా! యానంద||