హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ

haayi, lookamaa! prabhuvachchen angeekarinchumee

🎵 TG-131💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుఁడీ.

1వ చరణం

హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపఁజేసి మా యేసే జయంబు నొందును. ||హాయి, లోకమా!||

2వ చరణం

పాప దుఃఖంబులెల్లను నివృత్తిఁ జేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును. ||హాయి, లోకమా!||

3వ చరణం

సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కు(డీ స్తోత్రార్హుఁడాయెనే. ||హాయి, లోకమా!||

Report Error