హల్లే హల్లే హల్లే హల్లేలూయా

hallee hallee hallee halleeluuyaa

🎵 TG-1935🌐 Telugu
పల్లవి

హల్లే హల్లే హల్లే హల్లేలూయా ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2) నిను చూడని కనులేల నాకు నిను పాడని గొంతేల నాకు నిను ప్రకటింపని పెదవులేల నిను స్మరియించని బ్రతుకు ఏల (2)      ||హల్లే||

1వ చరణం

నే పాపిగా జీవించగా నీవు ప్రేమతో చూచావయ్యా నాకు మరణము విధియింపగా నాపై జాలిని చూపితివే యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యని మొరపెట్టగా నీ దయ చేత దృష్టించినావే (2)      ||నిను||

2వ చరణం

నా శాపము తొలగించినావు నా దోషము భరియించినావు నాకు జీవం మార్గం నీవైతివయ్యా నిత్య నరకాన్ని తప్పించినావు యేసయ్యా యని విలపించగా నీ కృప చేత రక్షించినావు

Report Error