హల్లేలూయని పాడరండి

🎵 TG-003🌐 Telugu
పల్లవి

హల్లేలూయని పాడరండి విజయుడైన యేసునకు (2) మరణము గెలిచె గదా మహిమతో లేచె గదా (2) ||హల్లేలూయని||

1వ చరణం

పాప బలము మరణ భయము లేదు ఈ జగతిలో (2) మరణపు ముళ్ళు విరిచివేసెను (2) నిత్య జీవమిచ్చెనుగా ||హల్లేలూయని||

2వ చరణం

ఖాళి సమాధి కనుపరచెనుగా పునరుత్తాన వార్తను (2) జీవము నిండిన దేవుడిలలో (2) యేసు క్రీస్తు ప్రభువొక్కడే ||హల్లేలూయని||

Report Error