హల్లెలూయ పాట – యేసయ్య
halleluuya paata – yeesayya
🎵 TG-1582🌐 Telugu
పల్లవి
హల్లెలూయ పాట – యేసయ్య పాట పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4) ||హల్లెలూయ||
1వ చరణం
కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2) స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2) ||హల్లెలూయ||
2వ చరణం
చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా