హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
hee prabhuyeesu hee prabhuyeesu hee prabhu deevasutaa
పల్లవి
సిల్వధరా - పాపహరా - శాంతికరా "హే ప్రభు"
1వ చరణం
శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధి శాంతిస్వరూప జీవనదీపా - శాంతి సువార్తనిధీ "సిల్వ"
2వ చరణం
తపములు తరచిన నిన్నేకదా - జపములు గొలిచిన నిన్నేగదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు -సఫలత నీవెకదా "సిల్వ"
3వ చరణం
మతములు వెదకిన నిన్నేకదా - వ్రతములుగోరిన నిన్నేగదా పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమతి నీవెగదా "సిల్వ"
4వ చరణం
పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా మలమల మాడిన మానవ హృదయము- కలకల లాడెగదా "సిల్వ"