హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు
hoosannanuchuu sthuthi paaduchuu seeyoonuku
🎵 TG-2879🌐 Telugu
పల్లవి
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ||
1వ చరణం
ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా||
2వ చరణం
మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా||
3వ చరణం
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా||