ఇది యెహోవా కలిగించిన దినము
idi yehoovaa kaliginchina dinamu
పల్లవి
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||ఇది యెహోవా||
1వ చరణం
మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||ఇది యెహోవా||
2వ చరణం
అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది యెహోవా||
3వ చరణం
ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||ఇది యెహోవా||
4వ చరణం
సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||ఇది యెహోవా||
5వ చరణం
దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||ఇది యెహోవా||