ఈ దినం సదా - నా యేసుకే సొంతం

ii dinan sadaa - naa yeesukee sontan

🎵 TG-1025💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా నాధుని ప్రసన్నత - నాతోడ నడచును రానున్న కాలము - కలత నివ్వదు నామంచికాపరీ సదా - నన్ను నడుపును "ఈ"

1వ చరణం

ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాటయైనను వెరవదెన్నడైనను నాదు హృదయము గాయపడిన యేసుపాదం అందు నడచెను "ఈ"

2వ చరణం

ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక నా నోట యేసు నామమే విరోదమైన ఆయుధాలు యేవిఫలించవు యెహోవా నిస్సియే నాదు విజయము "ఈ"

Report Error