ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు
immaanuyeelu rakthamu inpaina yuutagu
పల్లవి
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును ||ఇమ్మానుయేలు రక్తము||
1వ చరణం
ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధుఁ డాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదు. ||ఇమ్మానుయేలు రక్తము||
2వ చరణం
నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొఱ్ఱె పిల్ల? నీ రక్తంబె చాలును. ||ఇమ్మానుయేలు రక్తము||
3వ చరణం
నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందుఁ జూచెదన్. ||ఇమ్మానుయేలు రక్తము||
4వ చరణం
నా యా యుష్కాల మంతట నా సంతసం బదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మిద్దియే. ||ఇమ్మానుయేలు రక్తము||